British teenager Aditya verma issue in Spain
mictv telugu

విమానాన్ని పేల్చేస్తానన్న హిందూ యువకుడి అరెస్ట్

July 6, 2022

‘నేన తాలిబాన్ ఉగ్రవాదిని. విమానాన్ని పేల్చేస్తా…’ అంటూ విమానం ఎక్కబోయే ముందు సోషల్ మీడియాలో ప్రకటించిన హిందూ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన ఆదిత్యవర్మ అనే 18 ఏళ్ల హిందూ సంతతి యువకుడు  ఇటీవల స్నేహితులతో కలసి స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు. మెర్కోనా ఐలాండ్స్‌కు వెళ్లే ఈజీజెట్ విమానంలో ఆదివారం ప్రయాణించారు.

అంతకుముందు స్నాప్ చాట్ సోషల్ ఫ్లాట్ ఫామ్‌లో బాంబు హెచ్చరిక చేశాడు వర్మ. విషయం తెలుసుకున్న స్పెయిన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఈజీజెట్ విమానానికి రక్షణగా రెండు సైనిక విమానాలు పంపారు. పోలీసులు మెర్కోనాలో ఆదిత్య వర్మను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అతడు స్పెయిన్ నుంచి వెళ్లకుండా కోర్టు ఆదేశాల జారీ చేసింది. తాను ఊరికే బెదిరించానని, ఉగ్రవాదిని కానని వర్మ విచారణలో ఒప్పుకున్నా పోలీసులు పట్టించకోకుండా కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అతని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని, సైనిక విమానాలను పంపాల్సి వచ్చినందుకు భారీ ఖర్చయిందని, దాన్ని తమకు తిరిగి ఇప్పించాలని స్పెయిన్ ప్రభుత్వం మొత్తుకుంటోంది.