Home > Featured > భారతీయ విద్యార్థులకు ఒక్కరోజులోనే బ్రిటన్ వీసా

భారతీయ విద్యార్థులకు ఒక్కరోజులోనే బ్రిటన్ వీసా

British visas on speed process priority categories for Indian students

బ్రిటన్‌లో చదువుకోవాలని కోరుకునే భారత విద్యార్థులకు శుభవార్త. వారి వీసా కష్టాలు గట్టెక్కనున్నాయి. కేవలం ఒక్కరోజులోనే వీసా మంజూరు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేస్తునట్లు భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ ప్రకటించారు.

ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ విధానాల కింద త్వరగానే వీసాలు ఇస్తామని చెప్పారు. ‘‘మీరు త్వరగా దరఖాస్తు చేసుకోండి. విద్యార్థులకు ప్రయారిటీ వీసాల కింద ఐదు రోజుల్లో, సూపర్ ప్రయారిటీ కింద మరింత త్వరగా మంజూరు చేస్తాం’ అని ఓ వీడియోలో తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈమేరకు కొన్ని వివరాలు తెలిపింది. సూపర్ ప్రయారిటీ కింద దరఖాస్తు చేసుకుంటే మర్నాడే ఫలితం వెల్లడిస్తామని, దీని కోసం వీసా ఫీజుతోపాటు అదనఫు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతం వీసాల పరిశీలనకు 15 రోజుల గడువు తీసుకుంటోంది. 2022 జూన్ నాటికి బ్రిటిష్ ప్రభుత్వం 1.18 లక్షల మంది భారత విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. అంతకుముందు ఏడాది పోలిస్తే ఇది దాదాపు 90 శాతం ఎక్కువ.

Updated : 30 Aug 2022 9:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top