నిజమాబాద్‌లో కీచకబావ.. భవనంపై నుంచి దూకబోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

నిజమాబాద్‌లో కీచకబావ.. భవనంపై నుంచి దూకబోయింది..

April 21, 2018

మహిళలపై అపరిచితులే కాకుండా అయినవారూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భర్త లేని తనపై స్వయంగా బావే అత్యాచారానికి యత్నిస్తున్నాడని, అతని వేధింపులు భరించలేనని అంటూ నిజామాబాద్‌లో ఒక మహిళ తన కూతురితో సహా ఆత్మహత్యకు యత్నించింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం ఈ ఉదంతం జరిగింది.

బాధితురాలి భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు. ఆమెకు ఒక పాప ఉంది. వరసకు బావ అయిన నర్రా సాయిలు ఆమెను కోరిక తీర్చాలంటూ కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. దీనిపై ఆమె గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో జీవితైం విరక్తి చెందిన ఆమె శనివారం బిడ్డతో కలసి ఆస్పత్రిలోని ఏడో అంతస్తుకు చేరుకుంది. తనకు బావ బారి నుంచి రక్షణ కల్పించాలని, లేకపోతే అక్కడి నుంచి దూకి చనిపోతానని చెప్పింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పారు. దీంతో బాధితురాలు కిందికి దిగివచ్చింది.