నడిరోడ్డుపై లవర్‌తో కనిపించిన చెల్లి.. అన్న రియాక్షన్ ఇది - MicTv.in - Telugu News
mictv telugu

నడిరోడ్డుపై లవర్‌తో కనిపించిన చెల్లి.. అన్న రియాక్షన్ ఇది

June 10, 2022

రోడ్డుపై సరదాగా ప్రియుడితో కలసి నడుస్తున్న యువతిని చూసి.. ఆమె అన్న అడ్డుకున్నాడు. తన చెల్లెలు మరో వ్యక్తితో షికార్లు చేస్తున్నదని ఆ ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు. చెల్లెలిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె అన్నను ఎదురించింది. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ లో జరిగిందీ సంఘటన. ఆ యువతి(18) తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం నడుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో ఆ యువతి సోదరుడు అదే రోడ్డుపై బైక్ పై వెళుతూ వారిని చూశాడు. తీవ్ర ఆగ్రహానికి గురై తన చెల్లెల్లి బాయ్‌ఫ్రెండ్‌ను నడిరోడ్డు మీదే చితక్కొట్టాడు. చెల్లెలి చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆమె ప్రియుడు పోలీసులకు ఫోన్ చేయడంతో .. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు అండగా నిలిచింది. `మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మేం ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు. రోడ్డు మీద నడుస్తున్నామంతే. నా బాయ్‌ఫ్రెండ్‌ను నా సోదరుడు తీవ్రంగా కొట్టాడు. నేను ఇంటికి వెళ్లన`ని ఆ యువతి పోలీసులకు చెప్పింది.