పాల్వంచలో రేపిస్ట్ అన్న.. నిశ్చితార్థమైన చెల్లిపై..  - MicTv.in - Telugu News
mictv telugu

పాల్వంచలో రేపిస్ట్ అన్న.. నిశ్చితార్థమైన చెల్లిపై.. 

February 14, 2020

Brother

రక్త సంబంధాలు, విలువలు కామం మంటల్లో కాలిపోతున్నాయి. కాలిపోతున్నాయా? అంటే జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోంది. కొత్తగూడెం జిల్లాలో ఓ అన్న సొంత చెల్లెలినే  కాటేశాడు. ఘోరాన్ని తట్టుకోలేని ఆ అమ్మాయి తనువు చాలించింది. 

పాల్వంచకు చెందిన పిప్పిడి వెంకటి-రాధమ్మ దంపతుల చిన్న కూతురు భూమికకు ఇటీవల నిశ్చితార్థం చేశారు.  బంధువుల వివాహ వేడుకకు వెళ్తూ.. కూతురిని పాత పాల్వంచలోని కొడుకు రాంబాబు ఇంటిలో వదిలి వెళ్లారు. రాంబాబు రాత్రి చెల్లిని జ్యోతినగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడు. అన్నంటే తండ్రి తర్వాత తండ్రి అని భావించిన ఆమె నమ్మకం బూడిదైంది. ఆ కామాంధుడు చెల్లెలు అని కూడా చూడకుండా ఆమెను బలాత్కరించాడు.  

దీంతో ఆమె ఆ అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో రోడ్డుపైకి వచ్చిన భూమికను స్థానికులు గమనించి పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. ఆమెపై రాంబాబుతోపాటు అతడి స్నేహితుడు కూడా అత్యాచారానికి పల్పాడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.