నల్లగొండలో అన్నదమ్ముల నరికివేత.. అక్రమ సంబంధం..  - MicTv.in - Telugu News
mictv telugu

నల్లగొండలో అన్నదమ్ముల నరికివేత.. అక్రమ సంబంధం.. 

August 3, 2020

Brothers incident in Nallagonda .. Illegal relationship ...

నల్లగొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఓ కేసు విషయంలో బైయిల్‌పై ముగ్గురు అన్నదమ్ములు విడుదల అయ్యారు. ఇదే కేసుపై ఆగస్టు 4,2020 (మంగళవారం)న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంటి బయట జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి, జానపాటి హరి అనే ముగ్గురు అన్నదమ్ములు నిద్రిస్తున్నారు. వారు మంచి నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో వారిని అత్యంత దారుణంగా నరికి చంపేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం హజారి గూడెంలో తీవ్ర కలకలం రేగింది. వివాహేతర సంబంధమే ఈ దారుణ హత్యలకు దారితీసినట్లుగా సమాచారం. ఏడాది క్రితం చిన్న తమ్ముడు హరి భార్యతో రేవంత్ హిత్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్‌ను ముగ్గురు అన్నదమ్ములు కలిసి హత్య చేశారు. ఆ కేసులో జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి , జానపాటి హరి ముగ్గురు సోదరులు జైలుకి వెళ్లి వచ్చారు. ఇటీవలే వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. రేపు ఈ కేసు విషయంపై కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముగ్గురు అన్నదమ్ములు ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిమీద వేట కొడవళ్లతో దాడిచేసి నరికి చంపారు. మూడో సోదరుడు హరి ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యర్థులే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.