అన్నదమ్ములందరికి ఒకే భార్య.. అది కూడా మన దేశంలోనే - MicTv.in - Telugu News
mictv telugu

అన్నదమ్ములందరికి ఒకే భార్య.. అది కూడా మన దేశంలోనే

January 22, 2020

vfbng

మహాభారతంలో పంచ పాండవులు ద్రౌపతిని భార్యగా స్వీకరించిన సంగతి అందరికి తెలుసు. ఇది ఎప్పుడో పురాతన కాలంలో జరిగిన విషయం. కానీ నాగరిక సమాజంలోనూ ఇంకా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కూడా మన దేశంలో అన్నదమ్ములందరూ కలిసి ఒకే మహిళలను వివాహం చేసుకొని ఆమెతోనే సంసారం చేయడం విశేషం. హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఇది జరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ సమాజంలో కూడా ఇటువంటి ఆచారాలు ఉండటంపై ఇది తెలిసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇలా ఒకే మహిళను వివాహం చేసుకోవడం వెనక వీళ్లకు ఓ ఆచారం కూడా ఉందట.ఇక్కడి కుటుంబాలు ప్రధానంగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తాయి. దీంతో వారంతా కలిసి కట్టుగా పని చేసుకుంటూ జీవనం వెల్లదీస్తారు. కానీ కుటుంబంలో సోదరులు వేర్వేరు అమ్మాయిలను పెళ్లిలు చేసుకుంటే వేరుపడి కుటుంబ పోషణ, ఆస్తుల పంపకాల్లో తేడాలు వస్తాయని భావించి ఇలా అంతా కలిసి ఒకరినే పెళ్లి చేసుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని తాము ఇంకా కొనసాగిస్తున్నామని అంటున్నారు.

ఇలాంటి వింత ఆచారాలు మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఒకరి భార్యను మరొకరు ఎత్తుకుపోతారు. ఇంకో దేశంలో భార్యలను పరస్పరం మార్చుకోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. మనదేశంలో మహాభారతాన్ని తలపించే ఈ ఆచారం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.