మహారాష్ట్రలోని నాందేడ్ వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ విజయవంతమైంది. భారీగా టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సభా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్(KCR) విమర్శలు గుప్పించారు.
అదే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని (Maharastra) అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఎవరితో కలిసి వెళ్తామన్నదానిపూ క్లారిటీ ఇవ్వని కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ చేస్తామని మాత్రం స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామ గ్రామాన బీఆరెస్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు.
10 రోజుల్లోనే గ్రామ కమిటీలు కూడా నియమిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర అంతటా పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ పరిష్కారం కావలంటే గులాజీ జెండా భుజాన వేసుకుని కదిలిరావాలని పిలుపునిచ్చారు. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు.