టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరుతో జాతీయ పార్టీగా మార్చిన పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నమస్తే తెలంగాణ దినపత్రిక తరహాలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషల్లో దినపత్రికలను వెలువరించడానికి బీఆర్ఎస్ భారీ ప్రణాళికతో సిద్ధమైనట్లు వార్తా కథనలు వస్తున్నాయి.అందుతున్న సమాచారం ప్రకారం.. మొదట ఆంధప్రదేశ్‌లో ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ పేరుతో దినపత్రికను తీసుకొస్తారు. దీనికి సంబంధించి ఆర్ఎన్ఐ (రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా) కూడా పూర్తయి, ముద్రణ ఏర్పాట్లు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. నమస్తే తెలంగాణ పత్రిక నిర్వహణలో గడించిన అనుభవంతో ఇతర భాషా పత్రికను నిర్వహించడం తేలికేనపి గులాబీ దళం భావిస్తోంది. ఏపీ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రల్లో కన్నడ, మహారాష్ట్రల్లో బీఆర్ఎస్ పత్రికలు మొదలవుతాయని, సరిహద్దు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఇవి దోహదపడాయని అధిష్టానం భావిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పత్రికలకు ఒక రూపు వచ్చి జనంలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అయితే వార్తాపత్రిక సర్క్యలేషన్ దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పత్రికలు ఎంతవరకు ఆచరణ సాధ్యమనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.