తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కవితపై బండి సంజయ్ చేసిన అనుచిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీ తెలంగాణ భవన్లో బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. జాతీయ మహిళా కమిషన్కు బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉండగా గంట నుంచి ఈడీ విచారణలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై విచారణ కొనసాగుతోంది. అరుణ్ పిళ్లై అఫిడవిట్ ఆధారంగా కవితను ఈడీ ప్రశ్నీస్తున్నట్లు సమాచారం. ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. ఇక కవిత విచారణ అంశంపై ఆప్ నేతలతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అరెస్ట్ వరకూ వెళితే పెద్ద ఎత్తున నిరసనలకు ప్లాన్ చేస్తున్నారు. అంతవరకు ఢిల్లీలోనే బైఠాయించే యోచనలో ఉన్నారు మంత్రలు, నేతలు.