బంధాలు బలపడాలి.. ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
ఏ పార్టీకి అయినా క్షేత్రస్థాయి కార్యకర్తలే బలమమని, వారు బావుంటేనే పార్టీ బావుంటుందని ఆందోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. కార్యకర్తలు ప్రజలతో నిత్యం మమేకమై అభివృద్ధికి దోహదపడాలని, ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి వెళ్లి మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఆయన శనివారం వట్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ మండలస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ఎంపీ బీబీ పాటిల్‌తో స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, ‘‘కార్యకర్తలు అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండాలని అధ్యక్షుడు కేసీఆర్ గారు ఈ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మనం మనల్ని సంస్కరించుకోవడానికి ఇది చక్కని అవకాశం. మన మధ్య ఏవైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకుని మరింత శక్తిమంతంగా పనిచేద్దాం’’ అని పిలుపునిచ్చారు.
కార్యకర్తల మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పి, ప్రజలతో మరింతా మమేకం కావడానికి ఆత్మీయ సమ్మేళనాలను పార్టీ నిర్వహిస్తోంది ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లు రాష్ట్రాభివృద్ధి కోసం తీరిక లేకుండా పనిచేసి అద్భుత విజయాలు సాధించిందన్న ఆయన, ఇకపై తన కార్యకర్తల బాగోగులు చూసుకుటుందని అన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా మొహమాటం లేకుండా నాయకుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల సంక్షేం కోసం రైతుబంధు, గిరిజన బంధు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, కార్యకర్తలు వీటిని ప్రజల్లోకి తీసుకోవాలని ఎంపీ బీబీ పాటిల్ కోరారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నిర్వహించి ర్యాలీ, ఆటపాటల ప్రదర్శన కార్యకర్తలను ఆకట్టుకున్నాయి.