ఈడీ కేసులు పెట్టి భయపెట్టాలని బీజేపీ చూస్తుందన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అడ్డంగా దొరికించినందుకు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లు బీజేపీ వ్యవహారం ఉందని విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ” బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బీజేపీ జాతీయ నాయకులు నోటీసులు వెళ్లడంతో తనను ఇబ్బంది పెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈడీ ద్వారా నోటీసు పంపి.. అందులో ఏ కేసు గురించి అడుగలేదు.
వ్యక్తిగత సమాచారం, ఆస్తులకు సంబంధించి వివరాలు అడిగారు. మొదటి రోజు ఏ కేసులో విచారిస్తున్నారో చెప్పకుండా ఆరుగంటలు సంబంధం లేని ప్రశ్నలు వేశారు. తనతో పాటు అభిషేక్‌ను విచారిస్తే వారికి కావాల్సింది దొరకలేదు. ఇప్పుడు నందకుమార్‌ను విచారిస్తున్నారు. ఏదో విధంగా నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది ” అని రోహిత్ రెడ్డి అన్నారు. ఈడీ నోటీసులు, నందకుమార్ కస్టడీపై న్యాయపోరాటం చేయనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్, తుషార్ సిట్ విచారణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలసుకోవలని సూచించారు. బీజేపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్దిని చూడలేక బీజేపీ కుట్రలు పన్నుతుందని రోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనక అడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
ఏపీలో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించేది ఎప్పుడంటే..
బీజేపీకి ఎదురుదెబ్బ… కొత్త పార్టీని ప్రకటించిన గాలి జనార్ధన్ రెడ్డి
గుర్రంపై ‘గడప గడపకు’ వైసీపీ ఎమ్మెల్యే