ఎమ్మెల్యేలకు ఎర కేసులో రోహిత్ రెడ్డి ఈడీ విచారణపై సస్సెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్‌ని పశ్నించింది ఈడీ. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు రోహిత్‌రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని సీబీఐకి కేసు విచారణ అప్పగించడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఆయన.. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్ బెంచ్‌కు వెళ్లాలా..? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా..? అనేది నిర్ణయించుకుంటామన్నారు. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు వెల్లడించారు.
నిన్న రోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యే లను కొనుగోలు చేయాలన్న ప్రయత్నం మీ అందరికీ తెల్సిందే. సిట్ ద్వారా అందరికీ వీడియోలు వెళ్ళాయి. మా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. టీఆర్ఎస్ను బీఅర్ఎస్ గా మార్చడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఫిర్యాదుదారుడని ఈడీ నాకీ నోటీసులు పంపించింది. నాకు ఏ కేసో కూడా తెలియడం లేదు. ఇక రెండో రోజు నేను కేసు వివరాలు చెప్పకపోతే నేను రాను అంటే అప్పుడు చెప్పారు. ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు అని.. నేను దొంగను కాదు కాబట్టి నేను దేనికైనా సిద్దం. దేనికీ భయపడం. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. నన్ను ఎందుకు విచారణ చేశారు అని నేను కోర్టు కు వెళ్తున్నా. మరి BL సంతోష్, తుషార్ లు ఎందుకు విచారణకు రావడం లేదు. స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారు.?” అని ప్రశ్నించారు. మరి ఈడీ ముందు రోహిత్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనే విషయం పై ఉత్కంఠంగా మారింది.