సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలు లేకుండానే ముగిశాయి. మంత్రులు, పోలీసులు నచ్చజెప్పడంతో అభిమానులు పట్టువదలి మారేడుపల్లి శశ్మాన వాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని కలెక్టర్ నుంచి తమకు ఇంకా ఆదేశాలు రాలేదని డీసీసీ స్థాయి అధికారి ఒకరు వారిని అనునయించారు. చీకటిపడుతుండడంతో అంత్యక్రియలను పూర్తి చేశారు.
అంతకుముందు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డితోపాటు పలువురు మంత్రులు అక్కడికి చేరుకోగా సాయన్న అభిమానులు గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. సినిమావారికి పోలీసుల గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని, సాయన్న దళితుడైనందుకే అందుకు నిరాకరించారని ఆరోపించారు. కేసీఆర్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 72 ఏళ్ల సాయన్న ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. డయాబెటిస్ వల్ల ఇన్‌ఫెక్షన్‌తో ఎడమ కాలు కోల్పోయిన ఆయన డయాలసిస్ కూడా చేయించుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.