తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ లను నిందితులుగా చేర్చాలంటూ సిట్ గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని కోర్టు తిరస్కరించగా, కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. తాజాగా రివిజన్ పిటిషన్ ని హైకోర్టు కూడా కొట్టివేయడంతో సిట్ కి మరోసారి చుక్కెదురైనట్టయింది. అటు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఆ తీర్పు కాపీలో హైకోర్టు పలు అంశాలను ప్రస్తావించింది. అందులో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ని కోట్ చేస్తూ కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేశారని, దర్యాప్తు సంస్థ తన పరిధిని దాటి వ్యవహరించిందని అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి :
రేవంత్ రెడ్డి అరెస్ట్.. బొల్లారం పీఎస్కు తరలింపు
యూట్యూబ్ వీడియోస్తో రూ.40 లక్షల అప్పు తీర్చేశాడు
‘మా సినిమా చూస్తే.. రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కానీ ఓ కండీషన్’