ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారిస్తోంది. దేశ రాజధానిలోని ఈడీ ఆఫీసుకు ఆమె గంటక్రితం మందీమార్బలంతో వెళ్లారు. వెంట భర్త అనిల్, లాయర్ కూడా ఉన్నారు. అయితే ఈడీ అధికారులు కేవలం కవితను మాత్రమే లోనికి పంపి, వారిద్దని బయటే ఆపేశారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు సీనియర్ అధికారులను ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు.
మద్యం లైసెన్సుల మంజూరు, పాలసీ నిర్ణయంలో అక్రమాలు, కవిత ఫోన్లు పగలగొట్టారన్న ఆరోపణలు, ఆమె బినామాగా చెబుతున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై వ్యవహారం, ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు లావాదేవీలు, చాటింగ్ వివరాలకు సంబంధించి మొత్తం 26 ప్రశ్నలను సంధించనున్నారు. తాను నిజాలే చెప్తానని, భయపడే ప్రసక్తే లేదని కవిత చెబుతుండడం తెలిసిందే. విచారణ తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తో తలత్తే పరిస్థితులను అదుపులో ఉంచడానికి ఢిల్లీ పోలీసులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.