యాక్టివా బీఎస్ 6 వచ్చేసింది..ధర, ఫీచర్లు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

యాక్టివా బీఎస్ 6 వచ్చేసింది..ధర, ఫీచర్లు ఇవే

September 11, 2019

Honda Activa

 ప్రముఖ మోటార్ సైకిల్స్ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తన మొట్టమొదటి బీఎస్6 యాక్టివా 125 ఎఫ్‌ 1ను భారత మార్కెట్లో బుధవారం విడుదల చేసింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 

Honda Activa

నాయిస్‌ లెస్‌ స్టార్టర్‌ మోటార్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ క్లస్టర్‌ వంటి సరికొత్త ఫీచర్లు యాక్టీవా 125 ఎఫ్1 సొంతం. ‘నిశ్శబ్ద విప్లవం’లో భాగంగా బీఎస్‌-6 ఉద్గార నిబంధనల​ను అనుసరిస్తూ ఈ స్కూటర్‌ను రూపొందించారు. యువతను ఆకట్టుకునేలా డిజైన్‌‌ చేశారు. 125 సీసీ ఇంజిన్‌, డిస్క్‌ బ్రేక్‌ తదితర ఫీచర్లను అమర్చారు. స్టాండ్‌ ఇండికేటర్‌ దీనికున్న మరో ప్రత్యేకత. తద్వారా స్టాండ్‌ వేసి వుంటే ఇంజిన్‌ స్టార్ట్ కాదు. దీంతో ప్రమాదాలను కొంత మేర అరికట్టవచ్చు. మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధరను రూ.67,490 గా నిర్ణయించింది. 6 ఏళ్ల వారంటీ కూడా కల్పిస్తున్నారు.