హోండా కొత్త బీఎస్6 బైక్.. రూ. 72,900 - MicTv.in - Telugu News
mictv telugu

హోండా కొత్త బీఎస్6 బైక్.. రూ. 72,900

November 14, 2019

కాలుష్య నివారణ, తద్వారా పర్యావరణ పరిక్షణ లక్ష్యంగా మనదేశంలో బీఎస్ 6(భారత్ స్టేజ్) వాహనాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా కంపెనీ.. తన పాపులర్ స్కూటర్ యాక్టివాకు ఇప్పటికే బీఎస్6 ఇంజిన్లను జోడించింది. తాజా 125 సీసీ సామర్థ్యంలో మోటార్ సైకిల్‌ను కూడా తీసుకొచ్చింది. హోండా ఎస్పీ125 పేరుతో విడుడలైన ఈ బైక్ బీఎస్6 అందుకున్న రెండో బండి. ఢిల్లీ ఎక్స్ షో రూం ధర. రూ. 72,900. ఇందులో స్టాప్ స్టార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సైడు స్టాండు తీస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. 

bs6 Honda.

ఫీచర్లు.. 

 ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ 124 సీసీ ఇంజిన్‌, ఎయిర్ కూల్డ్ సింగిలి సిలిండర్, ఎల్‌ఈడీ డీసీ హెడ్‌ ల్యాంప్స్‌, డ్రమ్‌/ డిస్క్‌ వేరియంట్లు, ఇంజిన్‌ స్టార్ట్‌/స్టాప్‌ స్విచ్‌, 1285 వీల్ బేస్