ఆమెది పాక్ అతనిది బంగ్లా.. భారత్‌లో అడ్డం తిరిగిన కథ - MicTv.in - Telugu News
mictv telugu

ఆమెది పాక్ అతనిది బంగ్లా.. భారత్‌లో అడ్డం తిరిగిన కథ

June 2, 2020

BSF arrests Bangladeshi in Punjab without passport

ప్రేమకు కులమత, ధనికా పేదా తేడాలే కాదు, సరిహద్దులు కూడా ఉండవు. అందులోనూ ఇది సోషల్ మీడియా కాలం కావడంతో ఎవరు ఎవరితోనైనా ప్రేమలో పడిపోయే అవకాశాలు బోలెడు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో ప్రేమే కాకుండా దేశాలు, వాటికి చట్టాలు, పాస్ పోర్టులు కూడా ఉన్న సంగతి పట్టించుకోకుండా ప్రియురాలు పిలిచిందంటూ పరాయి దేశంలోకి అడ్డంగా అడుగుపెట్టి బుక్కయ్యాడు ఓ బంగ్లాదేశీ కుర్రాడు. 

ప్రేమ బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అతనికి ఫేస్‌బుక్ ద్వారా కరాచీలోని ఓ  యువతి పరిచయమైంది. ప్రేమగా మారడంతో ఇద్దరి కుటుంబాలు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయట. అందుకే బంగ్లా నుంచి పాస్ పోర్టు లేకుండా కోల్‌కతా చేరుకున్నాడు. తనిఖీల నుంచి తప్పించుకుంటూ పంజాబ్ చేరుకున్నాడు. అక్కడా సరిగ్గా తనిఖీ చేయకపోతే పాక్‌కు వెళ్లిపోయేవాడు. అత్తారీ వాఘా సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకుని ప్రశ్నించారు. ప్రేమకథ రీల్ వేశాడు. అతడు చెప్పింది నిజమో కాదో తేల్చుకోడానికి జవాన్లు ప్రస్తుతం కూపీ లాగే పనిలో ఉన్నారు.