ఆలస్యం ఖరీదు రెండు ప్రాణాలు..సీనియర్‌ను కాల్చి చంపిన జవాన్  - MicTv.in - Telugu News
mictv telugu

ఆలస్యం ఖరీదు రెండు ప్రాణాలు..సీనియర్‌ను కాల్చి చంపిన జవాన్ 

May 4, 2020

BSF jawans passed away in Sriganganagar

బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సీనియర్ ఆఫీసర్‌ను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకోవడం రాజస్థాన్ లో సంచలనం అవుతోంది. శివ చందర్ అనే కానిస్టేబుల్ భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని శ్రీగంగా నగర్ సెక్టార్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన సర్వీస్ తుపాకీతో ఎసై రవీంద్ర పాల్ సింగ్ ను కాల్చి చంపాడు. తరువాత తానూ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ వెల్లడించింది.

జార్ఖండ్‌కు చెందిన శివ చందర్‌కు శ్రీగంగానగర్ సెక్టార్ లోని రేణుకా పోస్ట్ వద్ద డ్యూటీ పడింది. ఈ క్రమంలో ఆదివారం మే3న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాడని రవీంద్ర పాల్ సింగ్.. శివ్‌ను తిట్టాడు. ఇద్దరి మధ్య వాదన పెరిగింది. దీంతో కోపాద్రిక్తుడైన శివ చందర్ తన సర్వీస్ తుపాకీతో రవీంద్ర పాల్ షూట్ చేశాడు. రవీంద్ర పాల్ ఘటన స్థలిలోనే మృత్యువు ఒడిలోకి చేరాడు. రవీంద్ర పాల్ మృతితో భయాందోలనకు గురైన శివ చందర్ తనకు తానుగా కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి చేశారు.