భయపెట్టి వీఆర్ఎస్‌లు.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరాహారదీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

భయపెట్టి వీఆర్ఎస్‌లు.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరాహారదీక్ష

November 25, 2019

BSNL employees to go on strike today, allege company of forcing voluntary retirement scheme

కిందిస్థాయి ఉద్యోగులను యాజమాన్యం బెదిరిస్తోందని బీఎస్ఎన్ఎల్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తప్పనిసరిగా స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) ఎంచుకునేలా కిందిస్థాయి సిబ్బందిని యాజమాన్యం భయాందోళనలకు గురిచేస్తోందని.. దీనిని నిరసిస్తూ నేడు (నవంబర్25)న దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలకు దిగుతున్నట్టు సంస్థ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. వీఆర్ఎస్ తీసుకోని వారి రిటైర్మెంట్ వయస్సును 58 ఏళ్లకు తగ్గించేస్తామంటూ, దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇస్తామంటూ మేనేజ్‌మెంట్ బెదిరిస్తోందని ఆలిండియా యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ (AUAB) కన్వీనర్ పి అభిమన్యు ఆరోపించారు. 

1.6 లక్షల మంది సంస్థ ఉద్యోగుల్లో ఇప్పటికే 77 వేల మందికి పైగా వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయని బీఎస్ఎన్ఎల్ సీఎండీ లెక్కల చెబుతున్నాయి. ఇందుకు ఉద్యోగులు వ్యతిరేకం కాదని.. అర్హులైన వారు, లబ్ధి చేకూరుతుందని భావించేవారు వీఆర్ఎస్ ఎంచుకుంటున్నారని ఉద్యోగులు అంటున్నారు. కానీ లబ్ధి చేకూరని దిగువ శ్రేణి ఉద్యోగులను యాజమాన్యం బెదిరించడంపై ఉద్యోగుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.