Home > Featured > BSNL బంపర్ ఆఫర్.. రోజుకు 10 జీబీ డేటా

BSNL బంపర్ ఆఫర్.. రోజుకు 10 జీబీ డేటా

BSNL..

కమ్యూనికేషన్ రంగంలో పోటీ పెరగడంతో వినియోగదారులకు టెలికం సంస్థలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ‘జియో’ వచ్చినప్పటి నుంచి ఈ పోటీ మరింత ఎక్కువైంది. ప్రైవేటు కంపెనీల పోటీ మార్కెట్లో అధికంగా ఉండటంతో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. రెండు ప్లాన్లలో రోజు 10 జీబీ డేటా, అపరిమిత కాల్స్ వాడుకునే వీలు కల్పించాలని నిర్ణయించింది.

రూ.96తో రీచార్జీ చేసుకుంటే 28 రోజులపాటు అపరిమిత కాల్స్, 10 జీబీల డేటా,రూ.236తో రీచార్జ్ చేస్తే 84 రోజులపాటు అపరిమిత కాల్స్, 10 జీబీ డేటా అందివ్వనుంది. 4జీ యూజర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం దీన్ని కొన్ని ప్రాంతాల్లో వినియోగించుకునే అవకాశం కల్పించింది. మహారాష్ట్రలోని అకోలా,భండారా, బీడ్,జైనా, ఉస్మానాబాద్ ప్రాంతాల్లో మాత్రమే ఇది చెల్లుబాటు కానుంది. కాగా ఇటీవలే రూ. 1,098 ప్లాన్‌తో ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లోని వారికి 75 రోజులపాటు 375 జీబీ డేటా, అపరిమిత కాల్స్ చేసుకునే వీలు కల్పించిన సంగతి తెలిసిందే.

Updated : 27 Aug 2019 3:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top