జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్! - MicTv.in - Telugu News
mictv telugu

జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్!

September 5, 2017

రిలయన్స్ కంపెనీ ఏ ముహూర్తంలో జియో నెట్ వర్క్ ను మార్కెట్లకు  తీసుకొని వచ్చిందోకని, అన్ని  నెట్ వర్క్ కంపిన్ల ఓనర్ల  గుండెల్లో  రైళ్లు  పరిగెత్తినంత  పనైంది.  జియో ఇస్తున్న ఆఫర్లు గసొంటియ్ మరి. మూడు నెలలదాక  నెట్టు , మాట్లాడుడు  ఫ్రీ అని సిమ్ములు పంచెవర్కు.. పబ్లికంత  పొట్టు పొట్టు వాడిరి. ఇప్పుడు  తక్కువ ధరకే  నెలంతా నెట్టు, కాల్స్ అనెవర్కు అందరు దానెంబటనే  పోతున్రు. ఇగ  కొత్త కస్టమర్ల మాట దేవుడెరుగు ఉన్న కస్టమర్లను కాపుడుకోనికి మిగతా కంపినోళ్లు  కొత్త కొత్త ఆఫన్ల తోని  ముందుకస్తున్నరు.

ఇగ ఇప్పుడు ప్రభుత్వ  టెలికం సంస్థ  బీఎస్ఎన్ఎల్ కూడా ఆషాడమాసం ఆఫర్ల లెక్క  ఉన్న కస్టమర్లను కాపాడుకోనికి, కొత్త కష్టమర్లను ఆకర్షించడానికి  భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. రూ.429తో రీచార్జ్‌ చేసుకోవడం ద్వారా 90 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవడంతో పాటు, రోజూ 1జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ‘రూ.429కే అపరిమిత వాయిస్‌  కాల్స్‌, రోజుకు 1జీబీ డేటా పథకాన్ని అందిస్తున్నాం. అంటే నెలకు రూ.143 మాత్రమే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పథకాల్లో ఇది ఉత్తమమైనది’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు డైరెక్టర్‌ ఆర్‌.కె. మిత్తల్‌ తెలిపారు. కనీ ఎవ్వలు ఎన్ని ఆఫర్లు వెట్టినా కూడా  జియోకు మార్కెట్ల ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడంలేదు.