జియో ఫైబర్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్.. రోజుకు 33జీబీ డేటా  - MicTv.in - Telugu News
mictv telugu

జియో ఫైబర్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్.. రోజుకు 33జీబీ డేటా 

September 8, 2019

bsnl......

జియోకు గట్టిపోటీ ఇవ్వడానికి ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు ఉన్న ప్లాన్‌ టారిఫ్‌లలో మార్పులు తీసుకువస్తోంది. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు చెందిన రూ.1,999 ప్లాన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఇకపై రోజుకు 33 జీబీ డేటాను అందివ్వనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. జియో ఫైబర్ లాంచ్ అయిన నేపథ్యంలో.. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్టు సమచారం. ఈ క్రమంలో వినియోగదారులు సదరు డేటాను 100 ఎంబీపీఎస్ గరిష్ట ఇంటర్నెట్ స్పీడ్‌తో వినియోగించుకోవచ్చు. అయితే 33జీబీ లిమిట్ అయిపోయిన తర్వాత నెట్ స్పీడ్ 4ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. మళ్లీ రోజు పూర్తి కాగానే డేటా లిమిట్ యథావిధిగా రెన్యూ అవుతుంది.