BSNL Offers These Amazing Heavy-Data Long-Term Prepaid Plans
mictv telugu

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్లు.. అన్‌లిమిటెడ్ డేటా & కాల్స్

May 7, 2022

BSNL Offers These Amazing Heavy-Data Long-Term Prepaid Plans

ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ సంస్థ BSNL సరికొత్త ఆఫర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ప్రైవేట్ కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాలతో పోటీ పడుతోంది. ముఖ్యంగా డేటా విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్లను ఇస్తోంది. ఆ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు ఏంటో చూద్దాం..

399 రూపాయల ప్లాన్‌తో రోజుకి 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు డైలీ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. 80 రోజుల వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, లోక్‌ధన్‌ కంటెంట్‌ ఉచితం. 429 రూపాయల ప్లాన్‌తో రోజుకి 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు డైలీ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. 81 రోజులు వ్యాలిడిటీతో ఈరోస్‌నౌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసెస్ పొందవచ్చు.

447 రూపాయల ప్లాన్‌తో 100 జీబీ హైస్పీడ్ నెట్‌ను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. పరిమితి ముగిసినా 80 కేబీపీఎస్‌తో ఉచితంగా ఇంటర్నెట్‌ వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ను డేటా వోచర్‌గా ఉన్నప్పటికీ ..అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్ వల్ల బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ఉంటాయి.
రూ.499 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. వంద ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ ఉంది. దీని వల్ల ఎలాంటి ఓటీటీ సభ్యత్వం రాదని సదరు సంస్థ వెల్లడించింది. రూ.1498 ప్లాన్ పూర్తిగా డేటా వోచర్‌గా ఉండనుంది. ఈ ప్లాన్‌తో కేవలం డేటా మాత్రమే వినియోగించుకోవచ్చు. మిగిలిన ఏ ప్రయోజనాలు పొందలేరు. రోజుకు 2 జీబీ డేటాను 365 రోజులపాటు పొందే అవకాశం ఉంటుంది.
ఇక 599 రూపాయల ప్లాన్ వర్క్ ఫ్రమ్ హోం ప్యాకేజీగా ఉంది. రోజుకు 5 జీబీ డేటాను 84 రోజులపాటు వినియోగించుకోవచ్చు. పరిమితి దాటినా 80 కేబీపీఎస్ వేగంతో నెట్‌ను వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జింగ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా చూడవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.