నష్టాలతో వీఆర్ఎస్.. అయినా కోటీశ్వరులను చేసి ఇంటికి ! - MicTv.in - Telugu News
mictv telugu

నష్టాలతో వీఆర్ఎస్.. అయినా కోటీశ్వరులను చేసి ఇంటికి !

November 20, 2019

BSNL VRS scheme to make employees lakhpati; highest payout to touch Rs 90 lakh

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతూ పది లక్షలు తక్కువతో కోటికి ఈశ్వరులు కాబోతున్నారు. నష్టాల కారణంగా తీసుకొచ్చిన  స్వచ్ఛంద పదవీ విరమణ పథకమే వారిని ఇలా సాగనంపుతోంది. ఈ పథకం కింద 50 సంవత్సరాలు పైబడిన కొంత మంది ఉద్యోగులు రూ. 90 లక్షలు ప్యాకేజీ పొందనున్నారు. దీంతో 50 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు పెద్ద మొత్తంలో వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల చేపట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రకారం 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగులు పదవీ విరమణను ఎంచుకోవడానికి అర్హులుగా ప్రకటించింది. దీంతో బీఎస్‌ఎన్‌లో పనిచేస్తున్న 1.6 లక్షల మంది ఉద్యోగుల్లో కనీసం లక్ష మంది (63శాతం) వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. 

రెండు వారాల్లోనే ఈ పథకానికి దాదాపు 80వేల మంది నమోదు చేసుకున్నారు. ఈ అవకాశం డిసెంబరు 3వ తేదీ వరకు ఉండడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు కాగా, 55 ఏళ్లు నిండిన వారికి వీఆర్‌ఎస్‌ పథకం కింద మిగిలిన ఐదేళ్ల కాలానికి జీతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రసుత్తం వీఆర్‌ఎస్‌ పొందే ఉద్యోగులు జీతంతో పాటు అదనంగా పొందనున్న పదవీ విరమణ ప్యాకేజీతో లక్షాధికారులుగానే రిటైర్‌ అవ్వనున్నారు. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ నెలవారీ జీతం బడ్జెట్ సుమారు రూ .1,200 కోట్లు ఉండగా, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వ్యక్తులు నెలకు కనీసం 75,000 రూపాయల జీతం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని ఎంచుకున్న 50 సంవత్సరాల వయస్సులో ఉన్న ఉద్యోగులు రూ .90 లక్షల విరమణ ప్యాకేజీని పొందనున్నారు.