బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. 1,699తో 15 నెలలు..  - MicTv.in - Telugu News
mictv telugu

బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. 1,699తో 15 నెలలు.. 

October 28, 2019

bsnl.....

ప్రైవేట్ టెలికం కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. దీర్ఘాకాలిక ప్యాకేజీలపై ఆసక్తి చూపే వారి కోసం ఆకర్షణీయ ప్యాకేజీ ప్రకటించింది. దీపావళి సందర్భంగా రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ను సవరించింది. అక్టోబర్ 31 లోగా రీచార్జి చేసుకుంటే అదనంగా మరో మూడు నెలలు కలిపి మొత్తం 15 నెలలపాటు ఈ ప్యాకేజీ ప్రయోజనాలు అందుతాయి. 

 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటు కాలం ప్రస్తుతం 365 రోజులు కాగా, ఆఫర్ కింద 90 రోజులు అదననంగా కలిపి 455 రోజులకు పొడిగించారు. ప్రస్తుతం రోజుకు 3.5 జీబీ డేటా అందిస్తున్నారు. 455 రోజుల ప్యాకేజీ కింద నవంబర్, డిసెంబర్‌ నెలల్లో రోజుకు 3 జీబీ డేటా వస్తుంది. రింగ్ బ్యాక్ టోన్ లేదా, కాలర్ ట్యూన్‌లను కూడా ఉచితంగా వాడుకోవచ్చు. రోజుకు 250 నిమిషాల కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా వాడుకోవచ్చు.