మాయావతి టార్గెట్.. కింగ్‌మేకర్.. అందుకే ఇలా.. - MicTv.in - Telugu News
mictv telugu

మాయావతి టార్గెట్.. కింగ్‌మేకర్.. అందుకే ఇలా..

October 18, 2018

ఒక్కోసారి మాయావతి తీసుకునే నిర్ణయాలు వైరిపక్షాలకే కాకుండా మిత్రులకు కూడా విస్మయం కలిగిస్తాయి. గందరగోళానికి గురిచేస్తాయి. ఇంకా చెప్పాలంటే దిమ్మదిరిగేలా చేస్తాయి. ఫెయిల్ అయినా ఆమె దాన్ని  ఒప్పుకుంటారు.  తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు  మాయావతా మజాకా అని అనుకునేలా చేస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి తాజా తాజా నిర్ణయాలు బీజేపీ వ్యతిరేక కూటమికి మింగుడు పడటం లేదు.  బీజేపీ యేతర కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరీ ఇబ్బంది కరంగా తయారైంది. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా మిత్రులంతా కలుసుకున్నారు ఇటీవల. దేశంలో మరో సారి బలమైన కూటమిగా ఏర్పబోతున్నారనే సంకేతాలు ఇచ్చారు. కొద్ది రోజులకే మాయావతి  రూటుమార్చేశారు.

నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ముందుకెళ్లాలని ముందుగా అనుకున్నారు. అనుకున్నట్లుగానే మాయావతితో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపారు. తొలుత దీనికామె ఒప్పుకున్నారని, తర్వాత ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సందర్భంగా స్థానిక పార్టీతో పొత్తులు పెట్టుకున్నారని  అన్నారు. వీరి వాదనను మాయావతి ఖండించారు. తాము కోరినన్ని సీట్లు ఇవ్వనందుకే వేరే పార్టీతో పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తాజాగా  రాజాస్థాన్ ఎన్నికల్లో  కూడా తాము ఒంటారిగానే పోటీ చేస్తామని చెప్తున్నారు బిఎస్పీ నాయకులు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే 200 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను  బరిలోకి దింపుతామని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుంగర్ రామ్ గెదర్ చెప్పారు.

BSP Chief Mayawati strategy irking congress as she goes separately for upcoming assembly and parliament elections eyeing on Kingmaker to get Prime minister post

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర పార్టీ నాయకులు చెప్తున్నారు.  దేశ ప్రధాని ఎవరో తేల్చే ఎన్నికల్లో మిత్రుల మధ్య పొత్తులు కూడా కదిరాయి. పైగా వీరే  పరస్పరం పోటీకి దిగుతున్నారు.  దీని వల్ల రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా  లేదా అనే విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మాయావతి నిర్ణయాల వల్ల పరోక్షంగా బీజేపీకి సాయం చేసినట్లు అవుతుందని మిత్ర పక్షాలు అంటున్నాయి. పార్టీ ఎత్తుగడల్లో భాగంగానే ఇలా చేస్తున్నామని  మాయావతి అంటున్నారు. ఇలా చేయడం వల్ల బీఎస్పీ కంటే బీజేపీకి మరింత ప్రయోజనం ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్నది.

మాయావతి, మమత, సోనియా గాంధీలు కల్సిస్తే జాతీయ రాజకీయాల్లో  మార్పు వస్తుందని అనుకున్న వారికి జరుగుతున్న పరిణమాలు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి సీన్ మారుతుంది కాబట్టి  అప్పటి వరకు మాయావతి  తప్పకుండా తమకు మద్దతునిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్లే  బీఎస్పీ తన సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను కోల్పోయిందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరో రెండు నెలల్లో జరుగుతున్న  నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాను సొంతంగా పోటీ చేసి తన బలం తెలుసుకోవాలని బీఎస్పీ  అనుకుంటున్నట్లుంది. దాదాపు తానుపోటీ చేసిన అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి  వరకు ఖాతాలు  తెరిచింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మునుపు మూడు స్థానాలు, రెండు స్థానాల వరకు గెలిచింది. సారి మరిన్ని  స్థానాలు  గెలుస్తామనే ధీమాతో బీఎస్పీ నాయకులున్నారు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఇటు మోడీ  గ్రాఫ్ నానాటికి దిగజారి పోతోంది.. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే పరిస్థితి  లేదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల నాటికి తాను కింగ్ మేకర్ లేదా లక్ బాగుంటే కింగ్ కావొచ్చనే అభిప్రాయంతో  బెహెన్జీ ఉన్నారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.