మాయావతి ఎందుకు రాజీనామా చేశారు..? - MicTv.in - Telugu News
mictv telugu

మాయావతి ఎందుకు రాజీనామా చేశారు..?

July 18, 2017

బీఎస్పీ అధినేత మాయావ‌తి అన్నట్టే రాజీనామా చేశారు. రాజ్య‌స‌భ‌లో త‌న‌ను మాట్లాడ‌నివ్వ‌డం లేద‌ని.. ఇలా అయితే రాజీనామా చేస్తాన‌ని హెచ్చ‌రించిన ఆమె.. సాయంత్రంలోపే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న రాజీనామాను రాజ్య‌స‌భ చైర్మ‌న్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి హ‌మిద్ అన్సారీకి అంద‌జేశారు.

రాజ్యసభలో రాజీనామా అస్త్రాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎందుకు తెరపైకి తెచ్చారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే సభలో పోరాడాలి కానీ ఎందుకు రాజీనామా చేశారు..?అస్సలు రాజ్యసభ సభ్యురాలు రిజైన్ చేస్తే… ఎగువ సభలో ఎలాంటి విధి విధానం ఉందో తెలుసుకుందాం.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు హాట్ హాట్ గా మొదలయ్యాయి. ద‌ళితుల‌పై దాడి అంశం రాజ్య‌స‌భ‌లో దుమారం లేపింది. త‌మ వ‌ర్గంపై దాడి జ‌రిగిన అంశాన్ని మాట్లాడ‌నివ్వ‌డం లేదంటూ బీఎస్పీ నేత మాయ‌వ‌తి ఆరోపించారు. మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుంటే రాజీనామా చేస్తాన‌ని హెచ్చరించారు. ష‌హ‌రాన్‌పూర్‌లో ద‌ళితుల‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌ను మాయావతి లేవ‌నెత్తారు. అయితే పూర్తి చర్చ కోసం డిమాండ్ చేయవచ్చుగానీ, పూర్తి సమయం మాట్లాడతానంటే కుదరదని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించారు.

అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ కలుగజేసుకున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీఎస్పీ ఓడిపోవ‌డం వ‌ల్లే మాయావ‌తి ఆందోళ‌న‌కు చెందుతున్నారని ఆరోపించారు. ఇది స‌భాప‌తిని అవమాన‌ప‌ర‌చ‌డ‌మే అని ఆయ‌న అన్నారు. చైర్‌కు స‌వాల్ చేసిన మాయావ‌తి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అని న‌ఖ్వీ డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తాన‌ని చెబుతూ మాయావ‌తి త‌న చేతిలో ఉన్న కాగితాల‌ను నేల‌కు విసిరికొట్టి కోపంగా స‌భ నుంచి వాకౌట్ చేశారు.

రాజ్యసభ నుంచి నిష్క్రమించాలంటే..

రాజ్యసభ నియమాల నిబంధనల ప్రకారం.. రాజీనామా చేయాల్సిన సభ్యుడు చైర్మన్ కు లేఖ రాయాలి, రాజీనామా చేయాలనే ఉద్దేశ్యంతో అభిప్రాయాన్ని తెలుపాలి. సభ్యుడు వ్యక్తిగతంగా లేఖ రాసినట్లయితే, రాజీనామా స్వచ్ఛందంగా, వాస్తవమైనది అని చైర్మన్ కు తెలియజేస్తే ఆయన వెంటనే రాజీనామాను అంగీకరిస్తారు.

చైర్మన్ ఈ లేఖను ఇతర మార్గాల ద్వారా స్వీకరించినట్లయితే, అతను లేదా ఆమె తాను, రాజ్యసభ సచివాలయం లేదా ఇతర ఏజన్సీల ద్వారా నిర్ణయించాలని విచారణ చేయవచ్చు – రాజీనామా స్వచ్ఛందంగా మరియు నిజమైనది – అతను నిర్ణయిస్తే, రాజీనామాను తిరస్కరించవచ్చు. ఒక సభ్యుడు తన రాజీనామాను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు, ఇది సభా నియమాల ప్రకారం అంగీకరిస్తారు.

సభ్యుడు రాజీనామా చేసిన కౌన్సిల్ కు చైర్మన్ కూడా తెలియజేయాలని, రాజీనామాను అంగీకరించినట్లు వారు తెలియజేస్తారు. రాజీనామా తరువాత, కార్యదర్శి జనరల్ బులెటిన్ , గెజిట్లో సమాచారాన్ని ప్రచురించాలి. నిబంధనల ప్రకారం, ఖాళీని నింపడానికి ఎన్నికల కమిషన్ కు ఒక నోటిఫికేషన్ కాపీని పంపాలి.