ప్రేయసిని వేధించాడని.. టీచర్‌ను చంపేశాడు... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేయసిని వేధించాడని.. టీచర్‌ను చంపేశాడు…

October 6, 2018

తాను ప్రేమించిన అమ్మాయిని వేధిస్తున్నాడనే కోపంతో ఓ ఉపాధ్యాయుడిని  కాల్చిచంపాడు బీటెక్ విద్యార్థి. ఈ దారుణ ఘటన ఢిల్లీలో జరిగింది. యూపీలోని భాగ్ పత్ పట్టణానికి చెందిన కశ్యప్ ఢిల్లీలో బీటెక్ చదువుతున్నాడు. అతనిప్రియురాలు పరీక్షల కోసం కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. అక్కడ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆమెను వేధిస్తున్నాడు. తనను ప్రేమించకుంటే, మాట్లాడుకుంటే చచ్చిపోతానని మెసేజ్ ఫోన్లు చేస్తూ.. బెదిరించాడు.

r

ఈ విషయం ఆమె కశ్యప్‌కు చెప్పింది. ఆగ్రహానికి గురైన కశ్యప్ నాటు తుపాకీ కొనుగోలు చేశాడు. ముఖానికి పొల్యూషన్ మాస్క్, తలకు టోపి ధరించి కోచింగ్ సెంటర్‌కు వెళ్లి కుమార్‌ను కాల్చి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కశ్యప్ పారిపోతున్న దృశ్యాలు కనిపెట్టి అరెస్ట్ విచారించగా.. తన ప్రియురాలిని వేధిస్తున్నాడని, అందుకే చంపేశాని పోలీసుల ఎదుట నిజం ఒప్పుకున్నాడు.