Btech students..gate exam in february..next month
mictv telugu

బీటెక్ విద్యార్థుల్లారా.. ఫిబ్రవరిలో గేట్ పరీక్ష..వచ్చే నెలలో

July 22, 2022

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ చేసేందుకు ఆసక్తిగా ఎదరుచూస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్షను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈ గేట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌‌ను ఆగస్టు నెలలో విడుదల చేస్తామని, ఈనెల 4,5,11,12 తేదీల్లో ఆల్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

” ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీలకు సంబంధించిన అర్హత పరీక్ష అయిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023ను ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ కాన్పూరు దక్కింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇందుకోసం వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుంది. బీటెక్‌తోపాటు బీఎస్సీ, బీకాం, బీఏ విద్యార్డులు ఈ పరీక్ష రాయవచ్చు. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు ఉంటాయి. పరీక్షకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ త్వరలో వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. గేట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలిస్తాయి. గేట్-2022కు 1.11 లక్షల మంది హాజరుకాగా, వారిలో 1.26 లక్షల మంది కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచే లక్ష మంది వరకు ఈ పరీక్షకు హాజరైయ్యారు” అని అధికారులు తెలిపారు.