చైనాలో మరో వైరస్ కలవరం.. ఎలుకలే కారణం - MicTv.in - Telugu News
mictv telugu

చైనాలో మరో వైరస్ కలవరం.. ఎలుకలే కారణం

July 6, 2020

nhmv

చైనాలో మరో వైరస్ కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో చిన్నాభిన్నమైన ఆ దేశంలో తాజాగా బోనిక్ బుబోనిక్ ప్లేగు లక్షణాలు బయట పడ్డాయి. మంగోలియాలో దీనికి సంబంధించిన లక్షణాలను వైద్యులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు దీనితో బాధపడుతున్నట్టుగా తేల్చారు. వెంటనే వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. ఈ వ్యాధి మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని వైద్యులు వెల్లడించారు. 

ఎలుకలు, పందికొక్కులు తినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెప్పారు. 19వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధితో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరమైనదిగా గుర్తించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తించి వారిని క్వారంటైన్ చేశారు. కరోనాతో అతలాకుతలం అవుతున్న వేళ కొత్త వైరస్ పుట్టుకురావడం అక్కడ కలవరం రేపుతోంది. ప్రస్తుతం మంగోలియా పరిధిలో మూడో స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.