సముద్రంలో కొట్టుకు వచ్చిన ఆలయం.. ఆశ్చర్యపోతున్న జనం - MicTv.in - Telugu News
mictv telugu

సముద్రంలో కొట్టుకు వచ్చిన ఆలయం.. ఆశ్చర్యపోతున్న జనం

February 26, 2020

gncvbn

సముద్రంలో అప్పుడప్పుడు పెద్దపెద్ద చేపల కళేబరాలు, ఇతర వస్తువులు కొట్టుకురావడం సహజం. కనీ ప్రకాశం జిల్లాలోని చీరల సముద్ర తీరంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. విజయలక్ష్మీపురం వద్ద ఉన్న తీరానికి గౌతమ బుద్దిడి మందిరం కొట్టుకు వచ్చింది. సుమారు 10 అడుగు ఎత్తు ఉన్న ఈ ఆలయాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఆలయం ఎక్కడి నుంచి కొట్టుకువచ్చింది. ఎవరిదనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 

వెదురు బొంగులతో కూడిన నాటుపడవపై ఉంది.  బుద్దుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం కూడా దీంట్లో ఉంది. మందిరంపై ఓ జెండా కూడా ఉండటంతో అది రుమేనియా దేశానికి చెందినదిగా కోస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఏదైనా నౌకలో వీటిని తరలిస్తుండగా తుపాను దాటికి కంటైనర్లు నీటిలో పడిపోయి ఇలా కొట్టుకువచ్చి ఉంటాయని అంటున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రామాయపట్నం – పెద్దపట్టపుపాలెం మధ్య తీరానికి  ఓ కంటైనర్‌ కొట్టుకువచ్చింది. అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ఒకే నౌక నుంచి పడిపోయి వేర్వేరు తీర ప్రాంతాలకు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు.