ఆత్మాహుతి దళాలను సిద్దం చేశాం .. వైసీపీకి బుద్ధా వెంకన్న వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆత్మాహుతి దళాలను సిద్దం చేశాం .. వైసీపీకి బుద్ధా వెంకన్న వార్నింగ్

April 20, 2022

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకుల మధ్య ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా కొనసాగుతుంది. మా పార్టీ అధినేత గొప్పవారు అని ఒకరు. కాదు కాదు మా పార్టీ అధినేతనే గొప్పవారు అని మరోకరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నారా చంద్రబాబుపై నోటికి వచ్చినట్లు ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడేవారికోసం వందమంది సూసైడ్ చేసుకునే ఓ బ్యాచ్‌ను తయారు చేశామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ..” చెత్తవాగుడు వాగే వారికీ ఈ హెచ్చరిక జారీ చేస్తున్నా.. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల జోలికొస్తే చంపడానికైనా, చావడానికైనా సిద్ధం. చంద్రబాబుపై దాడిచేస్తే పదవులు వస్తాయి అని అనుకుంటే చూస్తూ ఊరుకోనేది లేదు” అని అన్నారు.

మరోపక్క బుధవారం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పురస్కరించుకొని తెలుగు దేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున్న సంబురాలు చేశారు. చంద్రబాబు చిత్రపటంతో కూడిన భారీ కేక్‌ను తయారు చేయించి, టపాసులు కాల్చుతూ జన్మదిన వేడుకలను జరిపారు.