ప్రపంచ ఆర్థిక ధృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ..ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోకసభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. అనంతరం ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరకీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించిందన్నారు.
ఈ బడ్జెట్ లో రైతులు, యువత, మహిళలు, వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి. మహిళా సాధికారత దిశగా క్రుషి చేస్తున్నామని ఆర్ధికమంత్రి తెలిపారు. మహిళల కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. స్వయం, సహాయక గ్రూపుల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్లోని ముఖ్యమైనవ వాటిలో ఒకటన్నారు. యువతకు ఉపాధి లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్.