ప్రజలకు అనుగుణంగానే బడ్జెట్: హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజలకు అనుగుణంగానే బడ్జెట్: హరీశ్ రావు

March 7, 2022

hariesh

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు మూడోసారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. శాసనసభలో ఉదయం 11.30 గంటలకు హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసం వద్ద హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. “ప్రజల ఆకాంక్షలకు, వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది. మానవీయ కోణంలో బడ్జెట్‌ను తయారు చేశాం” అని అన్నారు. అనంతరం ఆయన జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోపక్క సోమవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం పట్ల ప్రతిపక్షాలు కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. తరతరాల సంప్రదాయాన్ని కేసీఆర్ కాలరాస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నారు.