సొగసు చూడ తరమా..! - MicTv.in - Telugu News
mictv telugu

సొగసు చూడ తరమా..!

August 7, 2017

ఫోటోలు గతించిన జ్ఞాపకాలకు సాక్ష్యాలు..

వర్తమానానికి వండర్ విజన్స్..

భవిష్యత్తుకు బహుమతులు..

ఛాయాచిత్రం దృశ్యకావ్యం అవుతుంది..

గతిస్తున్న కాలాన్ని, దాని సొగసును ఫోటోనే భవిష్యత్ తరాలకు కానుకగా ఇవ్వగలదు…,

మీరు చూస్తున్న ఈ ఫోటోలు ఎక్కడో ఊటీకి వెళ్ళో, ఏ కొడైకెనాల్ కు వెళ్ళో క్లిక్ మన్పించినవి కానేకావు. మన తెలంగాణ గడ్డ మీద వున్న సౌందర్యాన్ని ఓ అజ్ఞాత ప్రకృతి ప్రేమికుడు తన కెమెరాలో ఇలా ఎక్సెలెంట్ గా తీసిన ఛాయాచిత్రాలివి. అచ్చం పెయింటింగ్ లానే వున్నాయి కదూ. నిజామాబాదు జిల్లాలోని జాన్కంపేట, అశోక్ సాగర్లో వుందీ తామర పూల సౌందర్యం. సంతోష్ కుమార్ అనే మిత్రుడు ఎఫ్ బీలో పబ్లిష్ చేస్తే మాకూ మీతో ఈ తస్వీర్ల అందాన్ని పంచుకోవాలనిపించింది. అందుకే ఇలా తెలంగాణాలో మట్టి సౌందర్యానికి కొదవలేదని చెప్పటానికి ఇదొక నజరానా. మీరు కూడా హృదయనేత్రంతో చూడండి తెలంగాణ మట్టి పరిమళాలను ఆస్వాదించండి.