బాంబును నమిలిన బర్రె..! - MicTv.in - Telugu News
mictv telugu

బాంబును నమిలిన బర్రె..!

August 14, 2017

హైద్రాబాద్ లోని ఓ డంపింగ్ యార్డులో..ఏదో  తినే వస్తువు అనుకొని ఓ బర్రె బాంబును నమిలింది,పాపం బాంబుపేలడంలో బర్రె ప్రాణాలు పోయాయి. మియాపూర్‌లోని న్యూకాలనీ ఓంకార్‌ నగర్‌ డంపింగ్‌ యార్డులో పెద్ద శబ్ధం రావడంతో స్ధానికులు భయాందోళనతో పోలీసులకు ఫోన్ చేశారు.

విషయం తెలుసుకున్న వెంటనే మియాపూర్‌ ఏసీపీ, సీఐ హరిశ్చంద్రారెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. పేలుడు దాటికి గేదె శరీరం తునాతునకలై,బర్రె తల 500 మీటర్ల వరకు ఎగిరిపడిందట,

దీంతో పోలీసులు ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా అనే అనుమానంతో  డాగ్ స్క్వాడ్ ను రప్పించారు.అసలు పేలుడు పదార్థం ఇక్కడికి ఎలా చేరింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు