బర్రె ప్రతీకారం..చిల్లర గ్యాంగ్ నడుములు విరిగాయిగా..
మూగజీవాలకు కూడా తెలివితేటలు, జ్ఞాపకశక్తి ఉంటాయి. వాటికి ఎవరైనా అపాయం చేస్తే అవి తిరిగి దాడి చేస్తాయి. ఇటీవల జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం.కొందరు వ్యక్తులు రోడ్డుపై రెండు బండ్లకు గేదెలను కట్టి పోటీ పడ్డారు. ఎక్కువ వేగంతో బండ్లపై ప్రయాణిస్తూ గేదెలను హింసించారు. ఇంకా వేగంగా వెళ్ళడానికి వాటిని అతి దారుణంగా కొట్టారు. కొద్దిదూరం వెళ్లిన తరువాత అందులో ఓ గేదె బండిని డివైడర్‌కు తగిలేలా చేసింది. దీంతో బండి బోల్తా పడడంతో అందులోని ఆకతాయిలు కిందపడిపోయారు. తరువాత ఆ బర్రె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొందరు ఈ మొత్తం దృశ్యాన్ని కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. గేదెలను హింసించిన ఆకతాయిలు తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Revenge of buffalo. Identify animals. Via @singhvarun pic.twitter.com/mzxRPECG9x
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 24, 2020