Buffalo irked by Royal Enfield’s Bullet sound attacks rider
mictv telugu

డుగ్గు డుగ్గు బండిని ఢీకొట్టిన దున్నపోతు.. అసలు కారణమిదే

September 19, 2022

Buffalo irked by Royal Enfield’s Bullet sound attacks rider

బుల్లెట్ బండిపై మోజుతో, అతివేగంతో రోడ్లపైకి దూసుకెళ్తూ కొంతమంది యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాగే బుల్లెట్ బండిపై దూసుకెళ్లిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. విషయం ఏంటంటే? ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళ ఓ దున్నపోతును మేపడానికి రోడ్డుపై మెల్లగా తీసుకెళ్తోంది.

ఈ క్రమంలో దున్నపోతుకు ఎదురుగా ఓ వ్యక్తి బుల్లెట్ బండిపై అతి వేగంతో దూసుకుంటూ వచ్చాడు. ఇక ఎదురుగా వస్తున్న బుల్లెట్ బండి శబ్దాన్ని విన్న ఆ దున్నపోతు బెదిరిపోయింది. వెంటనే పక్కకు జరిగే ప్రయత్నంలోనే ఆ దున్నపోతు బుల్లెట్ బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్ బండిని నడుపుతున్న ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి నేలపై పడ్డాడు. ఏం జరిగిందో ఆమె అర్థం కాక కాసేపు షాక్ లో ఉండిపోయింది. గట్టిగా కేకలు వేసింది. వెంటనే గమనించిన స్థానికులు అతడిని లేపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీ కమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేస్తూ”శబ్ద కాలుష్యం వల్ల జరిగే నష్టాల్లో ఇదొక ఉదాహరణ. సైలెన్సర్ మార్చి బండి నడపటం వల్ల స్ట్రెస్, హై బీపీ, చెవుడు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయని” ట్వీట్ చేశారు.