మహారాష్ట్రలో విషాదం.. బిల్డింగ్ కూలి 8 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్రలో విషాదం.. బిల్డింగ్ కూలి 8 మంది మృతి

September 21, 2020

bcvb

మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొంది. భీవండి నగరంలోని ఓ మూడు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. దీంతో అందులో నివాసం ఉంటున్న వారంతా శిథిలాల కింద చిక్కుకొనిపోయారు. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీం అక్కడకు వచ్చి సహాయక చర్యలు ప్రారంభించింది.  20 మందిని రక్షించారు. ఇంకా శిథిలాల కింద వారి కోసం గాలింపు మొదలు పెట్టారు. మరింత ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. 

పటేల్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో 1984లో ఓ మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. అందులో మొత్తం 21 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో పలువురు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో నివాసితులు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఎవరూ ప్రమాదాన్ని ఊహించకపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. శిథిలాల కింద మరో 25 మంది ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం జాగ్రత్తగా గాలిస్తున్నారు. సహాయక చర్యలు పూర్తైన తర్వాత ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు.