Home > Featured > కుప్పకూలిన 4 అంతస్థుల భవనం.. శిథిలాల కింద 60 మంది!

కుప్పకూలిన 4 అంతస్థుల భవనం.. శిథిలాల కింద 60 మంది!

building collapse in lucknow

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగంతస్థుల బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరగగా, శిథిలాల కింద 60 మంది చిక్కుకున్నారని సమాచారం. ఇప్పటివరకు 3 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. ఒక్కసారిగా భవనం కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తుండగా, ప్రమాదానికి కారణం సిలిండర్ పేలుడు అని తెలుస్తోంది. ఇక నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రభావం రాజధాని ఢిల్లీపై పడగా, ఆ ప్రకంపనలకు ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. వజీర్ హసన్ గంజ్‌ రోడ్‌లోని పాత భవనాలు ఉండే ప్రాంతంలో అలయా అనే భవనం కూలిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా, శిథిలాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం బంధువులు హాహాకారాలు చేస్తున్నారు. ఇక ఎంత నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

Updated : 24 Jan 2023 9:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top