Home > Featured > తిరుపతిలో విషాదం.. ఇంటిని కూల్చేస్తుండగా బాలుడి మృతి

తిరుపతిలో విషాదం.. ఇంటిని కూల్చేస్తుండగా బాలుడి మృతి

bvgf

చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటిని కూల్చుతుండగా.. శిథిలాలు మీదపడి ఓ 14 ఏళ్ల బాలుడు మరణించాడు. కోటకొమ్మాల వీధిలో శనివారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో బాలుడు తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

భవన నిర్మాణ పనుల్లో భాగంగా ఓ భవనాన్ని కూలీలు కూల్చి వేవేస్తున్నారు. ఆ సమయంలో అక్కడే భరత్ అనే బాలుడు అక్కడి నుంచి వెళ్తన్నాడు. ఆ సమయంలో పైనుంచి బలమైన పెళ్లలు వచ్చి తలపై పడ్డాయి. తీవ్ర గాయాలతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు గమనించి రూయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భరత్‌ చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Updated : 30 May 2020 1:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top