భయపెడుతున్న బిల్డింగ్.. ఒక్కసారిగా పక్కకు వాలిపోయింది - MicTv.in - Telugu News
mictv telugu

భయపెడుతున్న బిల్డింగ్.. ఒక్కసారిగా పక్కకు వాలిపోయింది

February 6, 2020

ngfbf

నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు బెంగుళూరు వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉన్నట్టుండి బీటలు వచ్చి ఒకవైపునకు ఒరిగిపోయింది. దీంతో దాంట్లో నివాసం ఉంటున్న వారంతా  భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.హెబ్బాల కెంపాపురలో ఈ సంఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని చర్యలు ప్రారంభించారు. 

ఈ నాలుగు అంతస్తుల భవనంలో ఓ వ్యక్తి ప్రైవేటు హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా భవనం భారీ కుదుపుతో పక్కకు ఒరిగిపోయింది. ఏం జరిగిందోనని అంతా బయటకు పరుగులు తీయగా వాలిపోయిన దృశ్యాలను చూసి భయపడిపోయారు. వెంటనే స్థానికంగా నివాసం ఉంటున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ భవనం వెనకాలే బాబు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాదీ తీస్తున్నాడు. ఈ భవనానికి కేవలం 5 అడుగుల దూరంలోనే తవ్వకాలు చేపట్టడంతో ఒక్కసారిగా పక్కకు వాలిపోయిందని అంటున్నారు. వెంటనే ఈ భవనాన్ని కూల్చేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ ఘటన పై అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.