కార్లలో బ్రెతలైజర్ తప్పనిసరి..ఊదితేనే స్టార్ట్ అవుతుంది - MicTv.in - Telugu News
mictv telugu

కార్లలో బ్రెతలైజర్ తప్పనిసరి..ఊదితేనే స్టార్ట్ అవుతుంది

November 12, 2019

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నవారిని పట్టుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు బ్రెతలైజర్ పరికరాన్ని ఉపయోగిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారికి జరిమానా విధిస్తారు. కొన్ని కొన్ని సార్లు జైలు శిక్ష కూడా విధిస్తారు. అయినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పునరావతం అవుతూనే ఉన్నాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను అరికట్టేందుక ఐరోపా కూటమి సరికొత్త విధానాన్ని తీసుకొని వచ్చింది. 2022 సంవత్సరం నుంచి యూరప్‌లో తయారయ్యే అన్ని కార్లలో బ్రెతలైజర్స్‌‌ను అమర్చాలని నిర్ణయం తీసుకుంది.

Breathalyzers

దీనికి సంబందించిన చట్టాన్ని ఎప్పుడో రూపొందించినప్పటికీ ఐరోపా మండలి గత వారమే ఆమోదముద్ర వేసింది. 2024 నుంచి అన్ని కార్లలో బ్రెతలైజర్స్‌‌ను తప్పనిసరి చేయనుంది. డ్రైవర్‌ ఇంజన్‌ను స్టార్ట్‌ చేసే ముందు తప్పనిసరిగా బ్రెతలెజర్స్‌ను ఊదాల్సి ఉంటుంది. అప్పుడే ఇంజన్‌ స్టార్ట్‌ అవుతుంది. ఒక వేళ డ్రైవర్ మోతాదుకుమించి మద్యం సేవించినా, సరిగ్గా ఊదకపొతే కారు ఇంజిన్ స్టార్ట్ కాదు. కారు స్టార్ట్‌ అయ్యాక మార్గమధ్యంలో ఆల్కహాల్ తీసుకోకుండా నివారించేందుకు మధ్య మధ్యలో కూడా బ్రెతలెజర్స్‌లో ఊదాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఆల్కహాల్ తాగి కారును నడిపిన కేసులో శిక్ష పడిన డ్రైవర్లకు మాత్రమే అమలు చేస్తామని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. సాంకేతికంగా అది సాధ్యమా? అన్ని కార్లలో బ్రెతలెజర్స్‌ను అమర్చినప్పుడు, కారు నడిపే డ్రైవర్‌కు అంతకుముందు శిక్ష పడిందా, లేదా అన్న విషయాన్ని బ్రెతలైజర్స్‌ అనుసంధాన వ్యవస్థ ఎలా తెల్సుకుంటుంది? మద్యం తాగి కారు నడుపుతున్న డ్రైవర్‌ అప్పుడు ఏ కారు నడిపారో ఆ కారుకు మాత్రమే వర్తింప చేస్తారా? అద్దె డ్రైవర్లను పెట్టుకున్నప్పుడు మరి ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు బ్రిటన్‌ అధికారులకు ఎదురవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు అధికారుల లేవు. మరికొన్ని రోజుల్ అన్ని పరిష్కారాలు కనుగొంటారని తెలుస్తోంది.