మహిళా జర్నలిస్టుపై అత్యాచారం.. ఆపై హత్య - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా జర్నలిస్టుపై అత్యాచారం.. ఆపై హత్య

October 9, 2018

అక్రమాలను బయటపెట్టిన ఓ మహిళా జర్నలిస్టుపై దారుణం జరిగింది. అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు కామాంధులు. బల్గేరియాలో మారినోవా(30) ఓ టీవీ ఛానల్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పని చేస్తోంది. కాగా యూరప్ సమాఖ్య నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో అవినీతికి పాల్పడ్డాని మారినోవా కొద్ది రోజులుగా కొన్ని కథనాలను రాస్తోంది.Bulgaria faces calls for 'swift and thorough' investigation into murder of journalist Victoria Marinovaదీంతో ఆమెపై పగ పెంచుకున్న దుండగులు విక్టోరియాపై అత్యాచారాని పాల్పడి, చంపేశారు. మారినోవా ఊపిరాడక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని సైకియాట్రీ సెంటర్ వద్ద ఉంచారు. కాగా ఆమె తలకు భారీ గాయాలయ్యాయి. అయితే అక్కడున్న పేషెంట్ ఎవరైనా దాడి చేసి ఉంటారా? లేక ఇంకెవరైనా దాడిచేశారా అనే కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు.

యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రజలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఐరోపా సమాఖ్యతో పాటు జర్మనీ ఓ ప్రకటనలో బల్గేరియాను కోరాయి.