కరోనా కాటుకు రెజ్లింగ్ ఛాంపియన్ బలి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కాటుకు రెజ్లింగ్ ఛాంపియన్ బలి

July 16, 2020

Bulgarian Ex Wrestler With Corona

కరోనా మహమ్మారి ఓ రెజ్లర్ ప్రాణాలను బలి తీసుకుంది. బల్గేరియాకు చెందిన మాజీ రెజ్లింగ్‌ చాంపియన్ నికోలాయ్ షెటెరెవ్ వైరస్‌తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 33 ఏళ్ల వయసున్న నికోలాయ్ ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ అతనికి పరీక్షలు చేయగా కరోనా అని తేలింది. నెల రోజులుగా అతడు చికిత్స తీసుకుంటున్నాడు. బుధవారం పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో బల్గేరియన్ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ దీనిపై విచారం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆటగాళ్లు మహమ్మారి కాటుకు బలి అయ్యారు. 

ఇతడు లెజండరీ రెజ్లింగ్ కోచ్ సిమియన్ షెటెరెవ్ కుమారుడు కావడం విశేషం. నికోలాయ్ షెటెరెవ్ 2011లో 125 కిలోగ్రాముల విభాగంలో డాన్ కోలోవ్ అంతర్జాతీయ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు 2018 లో ఇదే విభాగంలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు.డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో అతనిపై నాలుగు సంవత్సరాల నిషేధించారు. కాగా నికోలాయ్ షెటెరెవ్ తండ్రి కూడా ఇటీవల వైరస్ బారిన పడి కోలుకున్నాడు. యువ రెజ్లర్ కన్నుమూయడంతో చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.