కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సెలెబ్రిటీలు, దేశ ప్రధానులను సైతం భయపెడుతోంది. ఇప్పటికే అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సహా ఎన్నో దేశాల ప్రధానులు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్‌కు కరోనా వైరస్ సోకింది.
కరోనా వైరస్ సోకిన ఓ ప్రభుత్వాధికారితో సమావేశం కావడంతో బోయికో కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. బల్గేరియా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 37,562 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే బల్గేరియాలో 1,043 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బల్గెరియాలో ఇప్పటివరకు 1,084 మంది కరోనాతో మరణించారు.