బంగారం మింగిన ఎద్దు.. పేడలో వెతుకులాట - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం మింగిన ఎద్దు.. పేడలో వెతుకులాట

October 30, 2019

Bull Eats 40 Grams Gold Ornaments

నాలుగు తులాల బంగారాన్ని ఓ ఎద్దు లాగించేసింది. దాన్ని పోగొట్టుకున్న ఆ కుటుంబం దాని కడుపులోంచి బయటకు తీసుకురావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పేడ ద్వారా పోయిన బంగారం బయటకు వస్తుందేమోననే ఆశతో ఎదురు చూస్తున్నారు. అందుకోసం దాన్ని తమ ఇంటి ఆవరణలోనే కట్టేసి ప్రతి రోజు పేడలో వెతుకుతున్నారు. హరియాణాలో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.

కలనవాలికి చెందిన జనక్‌రాజ్‌ అనే వ్యక్తి  తన భార్యా,కోడలుకు చెందిన 40 గ్రాముల బంగారం వంటింట్లోని ఓ డబ్బాలో కవర్లో చుట్టిపెట్టాడు. ఆ విషయం మరిచిన వారు  కూరగాయాలు తరిగిన చెత్తను అదే డబ్బాలో వేసి ఇంటి బయట ఉన్న చెత్త కుండీలో పడేశారు. తర్వాత విషయం గుర్తుకు వచ్చి అక్కడికి పరుగు పరుగున వెళ్లి చూడగా చెత్త కనిపించలేదు. సీసీ ఫుటేజీ ద్వారా పరిశీలించగా దాన్ని ఓ ఎద్దు తిన్నట్టు గుర్తించారు. దీంతో బంగారం కూడా చెత్తతో పాటు దాని కడుపులోకి వెళ్లి ఉంటుందని భావించి దాన్ని వెతికి పట్టుకున్నారు.  

వెటర్నరీ డాక్టర్‌ను సంప్రధించగా దాని పేడద్వారా బంగారం బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించాడు. దాంతో పేడలోనైనా ఆ బంగారం బయటకు  వస్తుందేమోనని బాగా తిండిపెడుతూ దాని పేడలో వెతకడం ప్రారంభించారు.