‘బుల్లెట్ రాణి’ సనా మృతి - MicTv.in - Telugu News
mictv telugu

‘బుల్లెట్ రాణి’ సనా మృతి

October 24, 2017

దేశంలో 38వేల కిలోమీటర్లను మోటార్ బైక్ పై చుట్టేసిన హైదరాబాద్ ధీర వనిత సనా ఇక్బాల్ మంగళవారం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వేకువజా మున సనా, ఆమె భరత్ నదీమ్ ప్రయాణిస్తున్న కారు.. కాళీమందిర్, లంగర్ హౌజ్ ల మధ్య ఓ ఎలక్ట్రిక్ స్తంభానికి ఢీకొనింది. కారును నదీమ్ నడుపుతున్నాడు. సనా అక్కడికక్కడే  మృతిచెందగా, భర్తకు పక్కటెముకలు విరిగిపోయాయి.

గస్తీ పోలీసులు ఈ కారును గుర్తించి, నదీమ్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం తెలియడం లేదు. 30 ఏళ్ల సనా బుల్లెట్ రాణిగా దేశంలోని బైకర్లందరికీ పరిచయమే. ఆమె 2015లో ఆత్మహత్యల నిరోధక ప్రచారంలో భాగంగా బుల్లెట్ వాహనంపై దేశంలో 38 కి.మీ. పర్యటించారు.